Tuesday, 3 November 2026

కేంద్ర, రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు

శ్రీకాకుళం : సోంపేట మండలం బీల గ్రామ ప్రాంతంలో పచ్చని పోలాల మద్య నిర్మించతలపెట్టిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కేంద్ర , రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు పెడుతుంది. రాష్ట్ర మంత్రులు దీని నిర్మాణానికి అనుకూలంగా ఉంటే , కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వ్యతిరేకిస్తున్నారు. అముదాలవలసలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పోస్టాపీసు భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి కృపారాణి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బ్గంగా ఆమె మాట్లాడుతూ బీల గ్రామ ప్రాంతంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అక్కడి గ్రామస్థులు కూడా దీని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *