కేంద్ర సహకారం లేకపోయినా కార్యక్రమాలు అగడం లేదు

అభివృద్ది సంక్షేమాలకు చంద్రబాబు పెద్దపీట

విజయనగరం,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రామలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించి అమలరు చేస్తున్నారని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని కొనియాడారు. జయనగరం పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం రైతు ఉపశమన అర్హత పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు రుణ ఉపశమనం కల్పించి చరిత్ర సృష్టించారన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శించాయని, ఎద్దవా చేశాయని, రుణ ఉపశమనం కల్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఉపశమనం కలిగించారని తెలిపారు. రైతు ఉపశమనం సత్ఫాలితలు అందుస్తున్నాయని, ప్రతిపక్షాలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వి అత్యధికంగా ఎన్‌టిఆర్‌ జలసిరిని కార్యక్రమం వినియోగించుకుంటోందన్నారు. సాగునీటిని సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. రైతు చెంతకు రుణ పరిష్కార వేదిక తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం పొలం పిలుస్తోంది, ఎన్‌టిఆర్‌ జలసిరి, నీరు ప్రగతి వంటి పధకాలు పై రైతులకు అవగాహనా పెంచామని పేర్కొన్నారు.

 

తాజావార్తలు