Tuesday, 3 November 2026

కేటీఆర్‌.. విూనాన్న అన్న మాటలు విను

– సోనియా లేకుంటే తెలంగాణ కలగానే మిగిలిపోయేది
– ట్విట్టర్‌లో వేదికగా కేటీఆర్‌కు సూచించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
హైదరాబాద్‌, జులై 2(జ‌నం సాక్షి ) : తెలంగాణ మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు మరోసారి ఉత్తమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా చేసిన కృషిని ఎవరూ కాదనలేరన్నారు. సోనియా వల్లే తెలంగాణ కల సాకారం అయ్యిందని, కాదన్న వారు మూర్ఖులని ఉత్తమ్‌ అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్‌ అన్న మాటలను ఉత్తమ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘సోనియా గురించి అసెంబ్లీలో విూ నాన్న కేసీఆర్‌ అన్న మాటలు విను’ అంటూ ఉత్తమ్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ వ్యాఖ్య పెనుదుమారాన్ని రేపుతోంది. తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు…బొమ్మా కాదని, తెలంగాణను తాము పోరాడి సాధించుకున్నామంటూ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం కలగానే మిగిలిపోయేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీని గతంలో పొగిడిన తెరాస ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు కేటీఆర్‌, కేసీఆర్‌ తీరును గమనిస్తున్నారని, సెంటిమెంట్‌తో మరోసారి అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత దోచుకొనేందుకు కేసీఆర్‌ కుటుంబం ప్రయత్నిస్తుందని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా విమర్శించారు. కాగా తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఉత్తమ్‌ వ్యాఖ్యలు కేటీఆర్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చినట్లుగాకాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీనిపై కేటీఆర్‌ ఏవిధంగాస్పందింస్తారో వేచి చూడాల్సిందే.