వంచన దీక్ష చేస్తూ..

ఏపీ ప్రజలను మరోసారి వంచన చేస్తున్నారు
– బీజేపీ డైరెక్షన్‌లో జగన్‌ నాయకత్వం సాగుతుంది
– వైసీపీ విధానాలను ప్రజలు తిప్పికొడతారు
– విలేకరుల సమావేశంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌
విజయవాడ, జులై2(జ‌నం సాక్షి ) : వంచన దీక్షల పేరుతో వైసీపీ నాయకులు ఏపీ ప్రజలను మరోసారి వంచన చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం ఆర్డ్స్‌కాలేజీలో వైసీపీ చేస్తున్న వంచన దీక్షపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ స్పందించారు. సోమవారం ఆయన ప్రెస్‌ విూట్‌లో మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న మోసపూరిత విధానాల వల్ల, జగన్‌, విజయసాయి తమ కేసుల మాపీ కోసం ప్రధాని మోదీతో కలిసిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ద్వారా ఏపీ ప్రజలు మరొకసారి వంచనకు గురయ్యారని విమర్శించారు. చిత్త శుద్ధితో పోరాడే పెఢరల్‌ వ్యవస్థ అని, రాష్ట్రం నుంచి పన్నులు వెళితేనే కేంద్రానికి నిధులు ఉంటాయాని అన్నారు. జీఎస్టీ ద్వారా తెలుగు రాష్టాల్ర నుంచి కేంద్రానికి విపరీతంగా నిధులు వచ్చాయని, ఆ నిధులు రాష్టాల్రకు ఇవ్వకుండా… కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకుందని, రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్‌ చేసే పరిస్థితి కేంద్రానికి వచ్చినప్పుడు పెఢరల్‌ స్ఫూర్తితో కేందప్రభుత్వం విూద రాష్ట్రప్రభుత్వం పోరాటం చేస్తోందని అన్నారు. దాన్ని గమనించకుండా వైసీపీ నేతలు టీడీపీని, సీఎం చంద్రబాబును తిడుతూ.. విమర్శలు చేస్తున్నారని కనకమేడల మండిపడ్డారు. వంచనదీక్ష పేరుతో ప్రజలను వంచన చేయడం, రాజీనామాల పేరుతో ప్రజలను మోసగించడం.. ఇదీ వైసీపీ నైజమని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ డైరెక్షన్‌లో అమిత్‌ షా పర్యవేక్షణలో, జగన్‌ నాయకత్వంలో వైసీపీ నేతలు సోమవారం వంచన దీక్ష చేస్తూ.. ఏపీ ప్రజలను మరోసారి వంచన చేస్తున్నారని కనకమేడల అన్నారు.