కేటీఆర్ కోచింగ్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కూర రగోత్తమ్ రెడ్డి ముస్తాబాద్ జూన్ 13 జనం సాక్షి
తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ముస్తాబాద్ మండల కేంద్రంలో యువతీ, యువకులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ముస్తాబాద్ లో గత కొన్ని రోజులుగా కేటీఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఎంపీపీ జనగామ శరత్ రావు సొంత ఖర్చుతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. అందులో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న యువతీ, యువకులకు ముస్తాబాద్ నందు టీచర్ ఎమ్మెల్సీ కూర రగోత్తమ్ రెడ్డి సందర్శించి యువతీ,యువకులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు రాణించే విధానంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంల పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గన్నమనేని శ్రీనివాస్ రావు ,జడ్పీటీసీ గుండం నర్సయ్య ,తెరాస మండల అధ్యక్షుడు సురేందర్ రావు ,సర్పంచ్ గాండ్ల సుమతి ,మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జనబాయ్ ,మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్ బత్తుల అంజయ్య ,తెరాస పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి , బుచ్చిరెడ్డి , శివశంకర్ పాల్గొన్నారు