హైదరాబాద్ : తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. నగరంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కలుసుకున్న బన్సీ సరదాగా ముచ్చటించారు. గంటపాటు చిన్నారులతో అల్లు అర్జున్ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని కుటుంబ సభ్యులు..వైద్యులను బన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు బహుమతులను అందచేశారు. మేక్ ఏ విష్ ఏర్పాటు చేసిన బైక్ లను బన్నీ చిన్నారులకు అందచేశారు. మేక్ ఏ విష్ స్పూర్తిని అల్లు అర్జున్ అభినందించారు. పిల్లలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అన్ని డబ్బుతో కొనలేమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి గ్రస్థులకు డబ్బు సహాయం చేయడంకంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమని తెలిపారు.
కేన్సర్ బాధిత చిన్నారులతో బన్నీ..




