ఆదివారం హస్తినకు
హైదరాబాద్,జనవరి2 (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేరళ ఢిల్లీ పర్యటనలు వరుసగా జరపనున్నారు. ఈ సందర్భంగా కరళలో పర్యటనకు బయల్దేరి వెళ్లారు.ఆయన అక్కడ ఒక వివాహానికి హాజరు అవడమే కాకుండా, అక్కడ రెండు రోజులు ఉండి వస్తారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,పార్లమెంటరీ సెక్రటరీ జలగం వెంకటరావు,పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్ సభలో నేత జితేందర్ రెడ్డి కూడా కెసిఆర్ తో పాటు కేరళ వెళ్లారు. త్రిసూర్‌లో జరిగే వివాహ వేడుక కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. అనంతరం కేరళలోని అటవీ పరిశోధన కేంద్రాన్ని సీఎం సందర్శించనున్నారు. అలాగే కేసీఆర్ వచ్చే వారం దిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఆయన ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.





