కేశినేని వ్యాఖ్యలతో ఉద్రిక్తత

విజయవాడ,మే9(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లాలోని మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. అనంతరం టీడీపీ-వైసీపీ కార్యక్తలు ఘర్షణకు దిగారు. మైలవరంలో బుధవారం సహకార బ్యాంక్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అటు టీడీపీ-వైసీపీ నేతలు ఘర్షణకు పాల్పడి ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.

తాజావార్తలు