– రాహుల్‌గాంధీతో బాబు భేటీ ఎందుకో చెప్పాలి
– కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా ఢిల్లీకి గులాంలు అయ్యారు
– తెలంగాణలోని పరిశ్రమలకు ఇబ్బంది రానివ్వద్దు
– అలాఅయితే ఏపీకి ఎంతసాయం చేసినా మాకిబ్బందేవిూలేదు
– ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ గల్లంతు ఖాయం
– విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ వినోద్‌కుమార్
హైదరాబాద్, నవంబర్1(జనంసాక్షి) : తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంటే.. ఆంధప్రదేశ్ ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తెరాసను ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారని అన్నారు. చంద్రబాబు ఎందుకు రాహుల్‌ను కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ టికెట్లు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఇచ్చేవారని, కానీ ఇప్పుడు టికెట్ల వ్యవహారం ఢిల్లీలో చేరిందన్నారు. కాంగ్రెస్‌కు ఢిల్లీలో బాస్‌లు ఉంటే.. ఇప్పుడు టీడీపీ కూడా ఢిల్లీకి గులాంలు అయ్యారని విమర్శించారు. ఏపీ ప్రజల మెప్పుకోసం రాహుల్‌గాంధీ చంద్రబాబు మాట వింటున్నారని వినోద్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక.. టీఆర్‌ఎస్ కూడా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయబోతుందని చెప్పారు. ఏలావాదేవీల్లో చంద్రబాబుకు-మోదీకి తేడా వచ్చిందో ఇప్పటి వరకు తెలియదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. దానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. తొమ్మిది సీట్ల కోసం చంద్రబాబు.. రాహుల్ దగ్గరకు వెళ్లారని చెప్పారు. తెలంగాణలో ఉన్న పరిశ్రమలకు ఇబ్బంది కల్గకుండా.. ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తే ఇబ్బందిలేదన్నారు. ఏపీకి కేంద్రం ఎంత సాయంచేసినా మాకేవిూ ఫర్వాలేదన్నారు. తెలంగాణ ప్రజలు మహాకూటమిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో తెలంగాణలో గల్లంతు ఖావడం ఖాయమని వినోద్ జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఆత్మగౌరవాన్ని చంపుకుని జాతీయ పార్టీలతో కలిసి పనిచేయలేవని చెప్పుకొచ్చారు.
కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికే.. బాబు ఢిల్లీ వెళ్లారు




