Wednesday, 4 November 2026

కేసీఆర్‌ను విమర్శిస్తే లీడర్లు కాలేరు: టిఆర్‌ఎస్‌

మెదక్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్‌, రేవంత్‌రెడ్డిలు ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తుంటే వూరుకోమని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. వారు తెలంగాణకు వ్యతిరకుంగా వ్యవహరించిన టిడిపి పార్టీలో ఉంటే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ తెలంగాణ వ్యతిరేక చర్యలను మాత్రం సహించబోమన్నారు. విమర్శలకు కూడా ఓ హద్దుండాలని అన్నారు. కేసీఆర్‌ను విమర్శించి చంద్రబాబు మెప్పు పొందేందుకే తెదేపా నేతలు ఆరాటపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే జనం సహించరని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.కేసీఆర్‌పై విమర్శలకు దిగటం వారి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి యావత్తు దేశాన్నే అబ్బుర పరుస్తున్నాయన్నారు. దీనివల్ల తమకుపుట్టగతులు ఉండవనే వారు విమర్శలుచేస్తున్నారని అన్నారు. కెసిఆర్‌ అభివృద్దిని చూసి టిడిపి ఖాళీ కావడం చూసి వారికి భయం పట్టుకుందన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లాయని అన్నారు. తెరాస ప్రజల్లోకి దూసుకెళ్తుంటే తెదేపా మాత్రం దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు.తెదేపా సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు బంగారు తెలంగాణ నిర్మాణానికి తెరాసలో చేరారని, మున్ముందు ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు. తాజాగా మిషన్‌ కాకతీయకు కూడా ఏపీలో వేరే పేరుతో పథకం ప్రారంభించి దాన్ని కూడా కాపీ కొట్టారన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌, రేవంత్‌రెడ్డి జిల్లాకు వచ్చి సమావేశం నిర్వహించడం ద్వారా ఉనికి చాటే ప్రయత్నం చేశారు తప్ప ఆ పార్టీకి ఉనికే లేదని  అన్నారు. తెలంగాణ ద్రోహి బాబుతో ఎలా ఊరేగుతారని వారిని ప్రశ్నించారు. ఇంకెంతకాలం ఇలా తెలంగాణ వ్యతిరేక వ్యవహారాలు నడిపిస్తారని అన్నారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన బాబు ఏ మొఖంతో పర్యటిస్తారన్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి పనులను కాపీ కొట్టడం తప్ప బాబు చేస్తోందేవిూ లేదన్నారు. పార్టీ చేపడతున్న మంచిపనుల వల్లనే  తెరాసలో చేరుతున్నారని, ఇతర పార్టీలు సభ్యత్వ సేకరణను మించి టిఆర్‌ఎస్‌ ముందుకు వెళుతోందన్నారు.  దీన్ని బట్టి తెరాసపై అభిమానం ఎంత బలీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఈ పాటికే 3 లక్షల సాధారణ, ఒక లక్ష క్రియాశీల సభ్యత్వ సేకరణ పూర్తయిందని అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *