Wednesday, 4 November 2026

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా దీక్ష : ఫారూఖ్‌

మెదక్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా మార్చి మొదటివారంలో తానూ కూడా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఫారుఖహుస్సేన్‌ వెల్లడించారు. దీనికి గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్టపికే తమ ఎంపి వి. హన్మంతరావు హైదరాబాద్‌లో దీక్ష చేశారని అన్నారు. కార్పోరేట్‌ కంపెనీల కోసం భూసేకరణ చట్టం మార్చడం తగదన్నారు. రైతుల ఆత్మహత్యలపై ఇంకా ఉదాసీనత పనికి రాదని ఎమ్మెల్సీ ఫారుఖహుస్సేన్‌ అన్నారు. వారికి అండగా ప్రభుత్వం నిలిచి వారిలో భరోసా కల్పించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తూ దేశానికి వెన్నుముక్క అయిన రైతులను వూబిలోకి నెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి తరతరాల నుంచి వ్యవసాయంపై ఆధారపడిన రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటీవల భూసేకరణ ఆర్టినెన్స్‌ను వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యులు నిరాహారదీక్ష చేపట్టారని గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *