– ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నాడు
– ఇన్ని ఉద్యోగ సంఘాలెందుకున్నప్పుడు.. మరి విూ కుటుంబంలో అన్ని పదవులు ఎందుకు?
– ఉద్యమంపై రాళ్లేసిన వారినే పార్టీలో అందలమెక్కించాడు
– తండ్రీ కొడుకులకు బీజేపీ భయం పట్టుకుంది
– హుజూర్‌నగర్ టికెట్‌కు ఎనిమిది మంది ఆశావహులున్నారు
– వారిలో ఒకరిని ఎంపిక చేస్తాం
– శంకరమ్మ తమను సంప్రదించలేదు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 జనం సాక్షి : కేసీఆర్‌వి ధన రాజకీయాలని, అవి ఎక్కువ కాలం చెల్లుబాటు కావాని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు.. ఉద్యోగులను కేసీఆర్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని, ఇన్ని ఉద్యోగ సంఘాలు ఎందుకున్న కేసీఆర్.. విూ కుటుంబంలో అన్ని పదవులు ఎందుకో ఆలోచించాలని లక్ష్మణ్ సూచించారు. హుజూర్‌నగర్ టికెట్ ఆశించే బీజేపీ ఆశావాహులు 8మంది ఉన్నారన్నారని తెలిపారు. వీరిలో రామ్మోహన్ రావు, జైపాల్ రెడ్డి, రామకృష్ణ , శ్రీలత రవీంద్ర నాయక్‌లు వంటి పలువురు టికెట్ ఆశిస్తున్నారని అన్నారు. స్క్రీనింగ్ చేసి జాతీయ అధ్యక్షుడికి పంపుతామన్నారు. అంతేకాక శంకరమ్మ బీజేపీ నుంచి పోటీ చేస్తారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం అన్నారు. ఇంతవరకు ఆమె మమ్మల్ని కలవలేదు.. తాము కూడా ఆమెను సంప్రదించలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇన్నిరోజుల సచివాలయ భవనాలు కూలుస్తా అన్న కేసీఆర్ తాజాగా హై కోర్టును మారుస్తా అంటూ కొత్త పాట పాడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్‌వి ధన రాజకీయాలని.. మాకు ప్రజా సేవే ముఖ్యమన్నారు. ఉద్యమకారులను పక్కకు పెట్టి.. ఉద్యమంపై రాళ్లేసిన వారిని పార్టీలో చేర్చుకున్నారని.. అందుకే ప్రస్తుతం పార్టీలో ఓనర్లు, కిరాయిదార్ల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గంటలు గంటలు కూర్చుని దేని గురించి చర్చిస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. అన్నింటిని పక్క రాష్ట్రంతో పోల్చుకునే కేసీఆర్ ఎందుకు ఫాలో కావడం లేదని అడిగారు. తండ్రి, కొడుకులకు బీజేపీ అంటే భయం పట్టుకుందని.. అందుకే సభలో లేకపోయినా తమను తల్చుకుంటున్నారన్నారు. మున్సిపాలిటీల్లో బీజేపీ పోరుబాట పడుతుందని.. కొత్తగా తెచ్చిన చట్టం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు తిరగబడితే రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యమే బీజేపీ ఎన్నికల ప్రచారమని లక్ష్మణ్ అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో తమసత్తాను చూపిస్తామని తెలిపారు. గెలుపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ఖచ్చితంగా తమ ప్రభావాన్ని చాటుతామని లక్ష్మణ్ తెలిపారు.
కేసీఆర్‌వి ధన రాజకీయాలు




