Tuesday, 3 November 2026

కేసీఆర్‌ ఉచ్చులో పవన్‌ పడకపోవచ్చు

– ఫ్రంట్‌ పై జగన్‌తో చర్చిస్తానన్న కేసీఆర్‌లోనే గందరగోళం
– కాంగ్రెస్‌ నేత విజయశాంతి
హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌¬ం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు సంప్రదింపులు జరిపిన విషయంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ సందర్భంగా పవన్‌తో కేసీఆర్‌ చర్చలపై కాంగ్రెస్‌ నేత, నటి విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. జనసేన అధినేత అంత త్వరగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉచ్చులో పడకపోవచ్చని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన రాములమ్మ ఆసక్తిక ట్వీట్లు చేశారు. ‘ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు సమదూరం పాటిస్తోన్న పవన్‌ కళ్యాణ్‌ను ఏదో రకంగా వివాదంలోకి లాగేందుకు టీఆర్‌ఎస్‌ కూడా ప్రయత్నం చేస్తోందన్నారు. మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ల మాదిరిగా పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు కలిస్తే తప్పేంటి అని టీడీపీ నేతలు అంటున్నారని అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అంతకు ముందే పవన్‌ కళ్యాణ్‌ తో మంతనాలు జరపడం ద్వారా ఏమి మెసేజ్‌ ఇవ్వదలచుకున్నారు? కేంద్రం లో బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు చెయ్యడం కంటే వైసీపీ, జనసేన లను ఒకే వేదిక విూదకు తేవడమే కేసీఆర్‌ అసలు అజెండాగా కనిపిస్తోందన్నారు.  ప్రజారాజ్యం పొత్తు వద్దని టీడీపీ తో 2009 లో జత కట్టిన కేసీఆర్‌ గురించి సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి పవన్‌ కి టీఆర్‌ఎస్‌ జిత్తులపై బాగానే క్లారిటీ ఉంటుందేమోనని, పవన్‌ అంత త్వరగా కేసీఆర్‌ ఉచ్చులో పడకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. రాజ్‌ భవన్‌లో పవన్‌ కళ్యాణ్‌తో కేసీఆర్‌ మంతనాలు జరపడం మరింత గందరగోళానికి కారణమైందని, ఇంతకీ ఏపీకి వెళ్లి వైఎస్‌ జగన్‌తో ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చిస్తానన్న కేసీఆర్‌ అంతకు ముందే పవన్‌తో మంతనాలు జరపడం ద్వారా ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారని ఆమె నిలదీశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు చెయ్యడం కన్నా వైసీపీ, జనసేనలను ఒకే వేదిక విూదకు తేవడమే కేసీఆర్‌ అసలు అజెండాగా కనిపిస్తోందని విజయశాంతి విమర్శించారు.