Monday, 2 November 2026

కేసీఆర్‌ కౌలు రైతులపై.. 

విషం కక్కుతున్నాడు
– కౌలుదారులు ఏమైనా భూయాజమాన్యం హక్కు అడుగుతున్నారా?
– న్యాయం చేయకుంటే పోరాటం ఉదృతంచేస్తాం
– జనసమితి అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కౌలు రైతులపై విషం కక్కుతున్నారని జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. శనివారం యన విలేకరులతో మాట్లాడారు.. కౌలుదారుల విూద సీఎం విషం కక్కుతున్నారని వ్యాఖ్యానించారు. కౌలుదారులు ఏమైనా భూయాజమాన్య హక్కులు అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే ఉంటారని, వారికి ఉపయోగపడని పథకం ఎందుకని నిలదీశారు. చిన్న రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వం వారికి న్యాయం చేసేవరకు పోరాటం ఉదృతం చేస్తామన్నారు. రైతుబంధు పథకంలో పెద్ద రైతులకే ఎక్కువ లాభం జరిగిందని, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం అంతా లేదని కోదండరాం అన్నారు. చిన్న, సన్న కారు రైతులకు రైతుబంధు వల్ల ఒరిగిందేవిూ లేదని అన్నారు. కేవలం భూస్వాములే రైతుబంధు పథకంలో లబ్ధిపొందారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ పాలనతో అసంతృప్తిగా ఉన్నారని, కేవలం హావిూలు ఇవ్వటమే తప్ప వాటిని అమలు
చేయలేని పరిస్థితుల్లో తెరాస ప్రభుత్వం ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేసీఆర్‌కు పాలన చేతకాకనే నాలుగున్నరేళ్లకే దిగిపోతానంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని, రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు.