విభజన చట్టాన్ని అమలు చేయండి
కేంద్ర హోమంత్రి
రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక భేటి
న్యూఢిల్లీ,అక్టోబర్28(జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవం తమైంది.రాష్ట్ర విభజన అంశాలతో పాటు, హైకోర్టు విభజనపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సిఎం కెసిఆర్ కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఏడాదిన్నరగా విభజన అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయని సిఎం ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. రాజ్‌నాథ్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి జరిపిన భేటీ ముగిసింది. సమావేశంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, డీజీపీ అనురాగ్‌శర్మలు పాల్గొన్నారు. సమావేశ వివరా లను ఎంపీ వినోద్ విూడియా ద్వారా వెల్లడిస్తూ.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలుపై సీఎం రాజ్‌నాథ్‌తో చర్చించారన్నారు. షెడ్యూల్ 9,10 సంస్థల ఉద్యోగుల విభ జనపై చర్చించాం. రాష్ట్రానికి అఖిల భారత సర్వీస్ ఉద్యో గులను పెంచాలని కోరామన్నారు. అదేవిధంగా హైకోర్టు విభజ న త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ హైకోర్టు సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని హావిూ ఇచ్చారన్నారు. కేంద్ర ¬ంశాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి ఖర్చయిన నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఇలా పలు అంశాల పరిష్కారం కోరుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోపు సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు వినోద్ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయుత చండీ యాగానికి రావాలని రాష్ట్రపతిని కేసీఆర్ ఆహ్వానించినట్టు సమాచారం.మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఢిల్లీ వెళ్లే ముందు గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ కలిశారు. ఆయుత చండీయాగం కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన, సూచనలు సలహాల కోసం గవర్నర్ ను కేసీఆర్ కలిసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చండీయాగం కు దేశ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రదాని మోడీని చండీయాగానికి రావాలని కోరిన కెసిఆర్ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి ఆహ్వానించారు. కెసిఆర్ తెలంగాణ రావడానికి ముందు కూడా ఎంపి జితేందర్ రెడ్డి పామ్ హౌస్ లో చండీ యాగం నిర్వహించారు ఈసారి ఆయన తన పామ్ హౌస్ లోనే నిర్వహించనున్నట్లు సమాచారం . ఇప్పటికే గవర్నర్ నరసింహన్ తో భేటీ అయి చండీయాగం గురించి చర్చించారు.





