– ఏకపక్ష, నియంతృత్వ పాలన సాగించాడు
– కేసీఆర్ కుటుంబ సభ్యులకే లబ్ధి చేకూరింది
– సెక్షన్ 30, 144లతో భావ స్వేఛ్చకు భంగం కలిగించారు
– మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఎందుకివ్వలేదు
– రైతుబంధు పథకం రాబంధుల పథకం
– కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించడమే సీపీఐ సంకల్పం
– విూట్ ది ప్రెస్’లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విమర్శలు
హైదరాబాద్, నవంబర్26(జనంసాక్షి) : నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో కొత్తదనం ఏవిూ లేదని, కేవలం కేసీఆర్ కుటుంబానికే మేలు జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మహాకూటమినేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘విూట్ ది ప్రెస్’ చాడ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఏకపక్ష, నియంతృత్వ, కేంద్రీకృత వ్యవస్థ రాష్ట్రంలో కొనసాగిందని ఆరోపించారు. సెక్షన్ 30, 144 లాంటివి అమల్లోకి తెచ్చి భావస్వేచ్ఛకు భంగం కలిగించారని విమర్శించారు. జిల్లాల కేంద్రాల్లోనూ ధర్నాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హావిూలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని చాడ ఎద్దేవాచేశారు. నాలుగున్నరేళ్లలో ఉద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, నల్గొండలో డిండి, నక్కలగండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదన్నారు. 69శాతం రిజర్వేషన్ల కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నాచేస్తానని కేసీఆర్ చెప్పలేదా అని చాడ ప్రశ్నించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సకాలంలో రుణమాఫీ కాక రైతులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. రైతుబంధు పథకం రాబందుల పథకమని, విదేశాల్లో ఉన్నవారికి కూడా రైతుబంధు పథకం వర్తింపజేయడం ఏమిటని, ఇలాంటి పథకాలతో పేదల డబ్బును పెద్దలకు పెట్టినట్లవుతుందని అన్నారు. రెండెకరాలు ఉన్నవారికి అదే రీతిలో 100 ఎకరాలకు ఉన్న వారికి అదే రీతిలో పథకం ఉండటం మంచిదికాదన్నారు. తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య ఏమైందని చాడ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మున్సిపల్ కార్మికులను ఏకపక్షంగా ఉద్యోగాల నుంచి తొలగించారు.ఉస్మానియా విద్యార్థుల ఆవేదన చూస్తే బాధ కలుగుతోందన్నారు. ఓయూలో వర్సిటీలో కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదని చాడా వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. ఏడాది క్రితం సీపీఎం.. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఏర్పాటు ప్రతిపాదన మా ముందుంచారని చాడ తెలిపారు. తెలంగాణలో అది సాధ్యం కాదని చెప్పామని, కావాలంటే లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కలిసి వచ్చేవారితో వెళ్దామని సూచించామని తెలిపామని అన్నారు. అయినా వారు వినలేదని, సీపీఎం రాష్ట్ర కమిటీ వామపక్ష ఐక్యతకు విఘాతం కలిగించిందన్నారు. మళ్లీ మమ్మల్ని వారితో కలిసి రాలేదని అనడం సరైంది కాదని చాడా వెంకటరెడ్డి అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కేవలం వారి వారి పార్టీల నేతలకు, వారి వారి కుటుంబ సభ్యులకు పాలన
ఫలాలు వినియోగించారు తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఏకపక్ష, నియంతృత్వ పాలనతో సాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడమే సీపీఐ లక్ష్యంగా ముందుకు సాగుతుందని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.




