– ఎవడబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నారు?
– కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి
హైదరాబాద్, మే3(జనం సాక్షి) : రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఎవడబ్బ సొమ్మని అప్పులు చేస్తున్నావని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలు, నిరుద్యోగుల హక్కని దాన్ని టీఆర్‌ఎస్ విస్మరించిందని మండిపడ్డారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ చేసిందేమైనా ఉందంటే కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు రావడమే అని అన్నారు. విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం అయ్యారని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్‌కు తెలంగాణ వాస్తవ పరిస్థితులు తెలియవని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, తెరాస నేతలు జేబులు నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాడు




