కేసీఆర్ పై హరిష్ రావు ప్రశంసలు..
మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. 1996-97 సంవత్సరంలో సిద్ధిపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ సిద్ధిపేటలో వేలాది మొక్కలు నాటారని గుర్తు చేశారు. ఆనాడే మొక్కలు నాటి సిద్ధిపేటను పచ్చగా చేశారన్నారు. ప్రస్తుతం సీఎం స్థాయిలో కేసీఆర్ మొక్కలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అంతేగాకుండా సిద్ధిపేట వారికి ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, పదేళ్ల క్రితం ఉద్యమ సమయంలో దీనికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సిద్ధిపేట జిల్లా అవుతుందని….రైళ్లు వస్తుంది..కాలువల ద్వారా నీరు వస్తుందని ఆనాడు కేసీఆర్ పేర్కొంటే ఇది సాధ్యమా అని అన్నారు. ఈ మూడింటిని కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. హరితహారం కార్యక్రమానికి నంగునూరు మండల ఉద్యోగులు ఒక రోజు వేతనం ఇచ్చారని అలాగే ప్రజాప్రతినిధులు కూడా విరాళం ఇస్తామన్నారు.