Monday, 2 November 2026

ఉన్నత విద్యామండలిని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ..

fiukviy8హైదరాబాద్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఎస్ఎఫ్ఐ పోరాటం ఉధృతం చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఐదు వేల రూపాయలకు కుదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఉన్నత విద్యా మండలి ముట్టడికి ప్రయత్నించింది. ఎస్ఎఫ్ఐ నేతలు ముట్టడించేందుకు ముందుకు కదిలారు. కానీ అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం డౌన్..డౌన్..అంటూ విద్యార్థులు నినదించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు అక్కడనే బైఠాయించారు. చివరకు పోలీసులు నేతలను ఈడ్చుకెళ్లారు. వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *