కొండమల్లేపల్లి పట్టణంలో విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

సాక్షి న్యూస్: పట్టణ కేంద్రంలో శనివారం నాడు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పట్టణంలోని నల్లగొండ రోడ్డులో గల విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం చేసి విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ యజమాని బొడ్డుపల్లి శంకర్ విజయలక్ష్మి కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర  కుమార్ నాయక్      మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఫంక్షన్ హాల్స్ కు దీటుగా అన్ని రకముల ఆధునిక వసతులతో అన్ని రకాల శుభకార్యములు సభలు సమావేశాలు జరుపుకొనుటకు విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ గౌరవంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ యజమాని బొడ్డుపల్లి శంకర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఫంక్షన్ హాల్ ను మధ్యతరగతి నిరుపేదల శుభకార్యాల నిర్వహణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయకుండా మధ్యతరగతి నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ఖర్చుతో వివాహ శుభకార్యాలు చేసుకునే విధంగా నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో అన్ని రకాల హంగులతో సకల సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ బంధుమిత్రుల సమేతంగా వివిధ రకాల శుభకార్యాలను చేసుకుని విధంగా విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగిందని తెలిపారు ఆర్థిక స్తోమత లేని వారు సాధారణ లిమిటెడ్ ఖర్చులతో విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ లో గౌరవంగా శుభకార్యాలు చేసుకోవచ్చని సంపాదనే ధ్యేయం కాకుండా మానవతా దృక్పథంతో సామాన్య మధ్యతరగతి నిరుపేద ప్రజలు కూడా గౌరవంగా వివాహ శుభకార్యాలు చేసుకునే విధంగా విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ ప్రారంభించడం జరిగిందని  యజమాని బొడ్డుపల్లి శంకర్ తెలిపారు మరి నీ వివరాలకు బుకింగ్ కొరకు వెంటనే సంప్రదించండి అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్, తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి, ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ, స్థానిక సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, పసునూరు యుగేందర్ రెడ్డి, రమావత్ దస్రు నాయక్, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ గంధం సురేష్, వస్కుల తిరుపతమ్మ కాశయ్య, శివ గౌడ్, వరికుప్పల సువర్ణ పాండు, ఎలిమినేటి సాయి, అధికారులు ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు