హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు ఆకస్మిక మృతి… తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీనటులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, కృష్ళ్ణడు, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల, తాగుబోతు రమేశ్ తదితరులు ఆయనకు ఫేస్‌బుక్ ద్వారా నివాళులర్పించారు. కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.




