కొత్తకోటలో ఎంఆర్పిఎస్ నాయకులు అరెస్ట్.,.

 కొత్తకోట మండల ఎంఆర్పి ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకొని మాదిగ రిసర్వేషన్ ఎబిసీడీ వర్గీకరణ పై ప్రధాని మోడీ నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు నివ్వగ కొత్తకోట నుండి హైదరాబాద్ వెళుతుండగా కొత్తకోట మండల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వారిలో కొత్తకోట ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జేఆర్ కుమార్ మాదిగ,అంబేడ్కర్ మండల అధ్యక్షుడు జనంపల్లి ఇజ్రాయిల్, అంబేడ్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు జే.మన్నెం, మాదిగ జేఎసి వనపర్తి జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగ, మండల దళిత సంఘం నాయకులు ముప్పురి రాజు తదితరులు ఉన్నారు.
Attachments area