Monday, 2 November 2026

కొత్తబిచ్చగాడు వచ్చినప్పుడల్లా అఖిలపక్షమా?

– ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలి

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :

కేంద్రంలోకి కొత్త బిచ్చగాడు వచ్చినప్పుడల్లా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ నిప్పులు చెరిగారు. కొత్త హోం మంత్రి వచ్చిన ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీల వైఖరి కోరడం ఫ్యాషన్‌ మారిపోయిందని ధ్వజమెత్తారు. ముందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తన వైఖరి ముందు చెప్పకుండా అన్ని రాజకీయ పార్టీల వైఖరి కోరడం సరికాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *