Wednesday, 4 November 2026

కొనసాగుతున్న దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌

దిల్లీ : దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 19 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ క్రమంగా వూపందుకుంటోంది. పోలింగ్‌ సందర్భంగా దిల్లీలో భారీ భద్రతను చేపట్టారు. 714 సమస్యాత్మక, 191 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌, కిరణ్‌బేడీ సహా పోటీలో 673 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *