కొనసాగుతున్న భారత పసిడి వేట
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో షూటర్లు చరిత్ర
పురుషుల 10 విూటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్
స్వర్ణ పతకం సాధించిన 16 ఏళ్ల సౌరభ్ చౌదరీ
న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు చరిత్ర సృష్టిస్తున్నారు. భారత పసిడి వేట కొనసాగుతోంది. డా.కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో భారత్‌ను మరో స్వర్ణం వరించింది. పురుషుల 10 విూటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరీ స్వర్ణ పతకం సాధించాడు. గత ఏడాది జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన సౌరభ్.. సెర్బియాకు చెందిన దమిర్ మైకెక్‌ను ఓడించి.. 245 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాక.. 2020లో టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌కి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు. కాగా శనివారం, అపూర్వి చండేలా గన్ గర్జించడంతో.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్ తొలిరోజే భారత్ స్వర్ణ బోణీ చేసింది. మహిళల 10 విూ ఎయిర్ రైఫిల్‌లో చండేలా వరల్డ్ రికార్డుతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
శనివారం ఆరంభమైన షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత మహిళా షూటర్ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఆదివారం భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి పసిడి పతకం సాధించాడు. తొలిసారి సీనియర్ విభాగంలో వరల్డ్‌కప్‌లో పాల్గొన సౌరభ్.. వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం
గెలుచుకున్నాడు. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ్గ/నైల్లో 245.0 పాయింట్లతో సౌరభ్ చౌదరి వరల్డ్ రికార్డు సాధించాడు. ఫైనల్లో పొడియం పొజిషన్‌ను సాధించిన సౌరభ్ కడవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే సెర్బియాకు చెందిన స్టార్ షూటర్ దామిర్ మికెక్‌పై వెనుక్కినెట్టి పసిడితో మెరిశాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం. ఫలితంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తును ఖాయం చేసుకున్నాడు. గతేడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 10 విూటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో కూడా వరల్డ్ రికార్డు సౌరభ్ చౌదరి పేరిటే ఉంది.
ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గతేడాది ఏప్రిల్‌లో చైనా షూటర్ రుజు జావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.