కర్నూలు,మే4(జనంసాక్షి): అకాల వర్షాల నేపథ్యంలో జిల్లాలో కంది, శనగ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వెంటవెంటనే తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కంది, శనగ పంట తరలింపు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు మార్కెట్‌యార్డు నుంచి కంది శనగలు తూకం వేసినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన వరకు మొత్తం బస్తాలు గోదాములకు తరలించారు. నాలుగైదు రోజుల్లో పంటనంతా కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తామన్నారు.




