కొవిడ్‌కి కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్
అనుమతించిన అమెరికా ప్రభుత్వం
వాషింగ్టన్,జూలై14(జనం సాక్షి ): కొవిడ్ మహమ్మారికి కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్‌కు అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేన్ర్ తాజాగా అనుమతి ఇచ్చింది. అమెరికా దేశంలో కొవిడ్ వైరస్ నివారణ కోసం కొత్త వ్యాక్సిన్ నోవావాక్స్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నోవోవాక్స్ వ్యాక్సిన్ ఇప్పటికే యూరప్ తో పలు దేశాల్లో అందుబాటులో ఉంది. నాలుగింట ఒక వంతు అమెరికన్ పెద్దలు ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదు. వారు ప్రొటీన్ ఆధారిత వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనాకు తమ కంపెనీ వ్యాక్సిన్ అత్యుత్తమ బూస్టర్ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. 18 సంవత్సరాల కంటే అధికంగా వయసు ఉన్న వ్యక్తులు నోవోవాక్స్ వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకునేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేష్రన్ ఆమోదించింది. బిడెన్ అడ్మినిస్టేష్రన్ ఇప్పటివరకు 3.2 మిలియన్ నోవావాక్స్ డోస్‌లను కొనుగోలు చేసిందని, ఈ నెలలో టీకాలు వేయడం ప్రారంభిస్తామని నోవావాక్స్ సీఈఓ స్టాన్లీ ఎర్క్ చెప్పారు.