Tuesday, 3 November 2026

కోదండరామ్‌ను చూస్తే ఉలిక్కిపడుతున్నారు

26-jeevan-reddy-congress-leader-600హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ను చూసి తెరాస ఉలిక్కిపడుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. కోదండరామ్‌పై తెరాస నేతల విమర్శలను ఆయన ఖండించారు. తెరాస నేతల వ్యాఖ్యలు తెలంగాణవాదులను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. ఐకాస ఛైర్మన్‌గా… తెలంగాణ రావడంతో కోదండరామ్‌ కీలకపాత్ర వహించారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన ఫాంహౌస్‌లోని పంటలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే కోదండరామ్‌పై విమర్శలు చేస్తున్నారని.. అసలు రాష్ట్రంలో పౌరహక్కులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *