Wednesday, 4 November 2026

కోమటి చెరువు వద్ద మినీ బ్యాటరీ కారు ప్రారంభం

సిద్దిపేట,జూలై6(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని కోమటిచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఇక్కడ సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌పై 7 సీటర్‌ బ్యాటరీ కారును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. బ్యాటరీ కారును స్వయంగా మంత్రే డ్రైవ్‌ చేశారు. ఈ సందర్భంగా కోమటి చెరువు సుందరీకరణ పనులపై అధికారులు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో మంత్రి హరీశ్‌ సవిూక్ష నిర్వహించారు. మినీ ట్యాంక్‌బండ్‌ సుందీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని టూరిజం, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి వెంట సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.