చిత్తూరు: డీసీసీబీ, డీసీఎంఎన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. నిన్న నిర్వహించిన ఎన్నికల్లో 11 డీసీసీబీ డైరెక్టర్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా… మూడింటిని తెదేపా చేజిక్కించుకుంది.డీసీఎంఎన్ డైరెక్టర్ స్థానాల్లో మూడింటిలో తెదేపా విజయం సాధించగా.. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు సరైన సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోవడంతో ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.




