కోల్డ్‌ స్టోరేజీలో మంటలు

అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
గుంటూరు,మే31(జ‌నం సాక్షి):  గుంటూరు మిర్చియార్డు సవిూపంలోని వీజీటీ శీతల గిడ్డంగిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతంతో తెల్లవారుజామున ఆకస్మాతుగా మంటలు చేలరేగినట్లు అనుమానిస్తున్నారు. శీతల గిడ్డంగిలోని ఐదో ఛాంబర్లో తీవ్రమైన పొగ ప్రారంభం కావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపులో తెచ్చేందుకు జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి పది అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులో తీసుకొచ్చారు. శీతల గిడ్డంగిలో 70వేలకు పైగా మిర్చిబస్తాలు నిల్వ వుంచినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వేల సంఖ్యలో మిర్చి బస్తాలు దగ్ధం కాగా.. మిగిలిన వాటిని ఇతర గిడ్డంగుల్లోకి తరలించారు.