కౌలురైతుల పాదయాత్ర

అమరావతి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఎపి కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 9న చలో కలెక్టరేట్‌ కి పిలుపునిస్తూ బుధవారం కౌలురైతులు పేరేచర్ల నుంచి గుంటూరు వరకూ పాదయాత్ర నిర్వహించారు. కౌలు రైతులు మాట్లాడుతూ.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని, సాగు ధృవీకరణ పత్రాలు, పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయంచేయాలని, మద్దతు ధరలు పెంచాలని, రుణ విముక్తి కల్పించి ఆత్మహత్యల నుంచి రైతులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఆగష్టు 9న జైలు భరో నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో కౌలు రైతులంతా పాల్గొన్నారు.

 

తాజావార్తలు