ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి
విజయవాడ,నవంబర్17(జనంసాక్షి): కృష్ణాజిల్లా కంకిపాడు డివిజన్ కమిటి ఆధ్వర్యంలో కంకిపాడు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం కౌలు రైతులంతా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం జన్న, మొక్క జన్న రైతులకు రెండు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించి, ఇప్పటికి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు బోనస్ ఇవ్వలేదని తెలిపారు. ఈ సీజన్లో కోతలు కొట్టివేతలు ప్రారంభించారని, రైతులకు టార్పాలిన్ పట్టాలు సబ్సిడీ విూద అందించాలని కోరారు. రెండవ పైరుకు పెసలు, మినుములు వెంటనే ఇవ్వాలని, నారుమళ్ళు పోసినప్పటి నుంచి కోతల వరకు ఎలుకలు దోమపోటు వలన ఎకరానికి 10 నుంచి ఇరవై సెంట్లు వరకు నష్టం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, దాళ్వా సాగుకు నీరిచ్చి వరి విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు.




