Monday, 2 November 2026

క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం: కేసీఆర్‌

KCR-Land-Regulatisationభూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, అక్రమ నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వు విడుదలైన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్‌ లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, క్రమబద్ధీకరించుకోని వారిని ఆక్రమణదారులుగానే పరిగణిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా భూ ఆక్రమణకు వీల్లేకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పూర్తిస్థాయి ప్రక్షాళనకే క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. మరోమారు ఇలాంటి క్రమబద్ధీకరణకు అవకాశం ఉండబోదన్నారు. దరఖాస్తు చేసుకోని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *