Monday, 2 November 2026

క్రీడలకు ప్రభుత్వం చేయూత : మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, అక్టోబర్‌ 31: రాష్ట్రస్థాయి మహిళల క్రీడా పోటీలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బుధవారంనాడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు.  ఆయన మాట్లాడుతూ 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో మహిళా క్రీడా పోటీలు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతహాగా క్రీడాకారుడని ఆయన అన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుం టున్నట్టు చెప్పారు. జిల్లాలోని 17 మండలాలలో 364గ్రామ పంచాయితీల్లో క్రీడా సామాగ్రి కొనుగోలుకు 5కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు, త్వరలోనే మంజూరు ఉత్తర్వులు రాగలవని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్‌కు జిఓ నెం.74 జారీ చేసిందని, అదే విధంగా ప్రతి స్కూల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తప్పనిసరి సబ్జెక్ట్‌గా జి.ఓ.నెం.63 జారీ చేసిందని ఆయన అన్నారు.  వచ్చే డియస్సీలో 4000మంది ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ టీచర్ల నియామకం చేపట్టనున్నట్టు చెప్పారు. వచ్చేనెల 28 నుండి ఒడిస్సాలో, యుపిలో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక చేయటం జరుగుతుందని, ప్రస్తుతం బాస్కెట్‌ బాల్‌, ఖోఖో, కబడ్డి క్రీడలో పోటీలు జరుగుతాయని ఆయన అన్నారు. కరీంనగర్‌ శాసన సభ్యులు, గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ సమావేశంలో ఎ.జెసి. సుందర్‌ అబ్నార్‌, డిఇఓ, లింగయ్య, డిఎస్‌డిఓ, వెంకటరమణ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *