Tuesday, 3 November 2026

క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలి

 

కోదండరామ్‌ పార్టీ సందించిన అంశాలను అర్థం చేసుకోవాలి

కెసిఆర్‌ ఫ్రంట్‌కు ఎందరు కలసి వస్తారో విశ్లేషించుకోవాలి

హైదరాబాద్‌,జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవసరమన్న కెసిఆర్‌ వాదనతో అందరూ ఏకీభవించడానికి కారణం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఈ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్న వారు, సమర్థిస్తున్న వారు కూడా రాష్టాల్రకు స్వేఛ్ఛ ఉండాలిన కోరుకుంటున్నారు. అయితే సిఎం కెసిఆర్‌ తలపెట్టిన కార్యక్రమం మంచిదే అయినా కాంగ్రెస్‌, బీజేపీలకు అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీలు కెసిఆర్‌తో నడవగలవా అన్నది అనుమానమే. మమతా బెనర్జీ, డిఎంకెలు కాంగ్రెస్‌ను వదిలి రారు. దేవేగౌడ్‌ ఎటు వాటం అయితే అటే ఉంటారు.అందుకే కెసిఆర్‌ ప్రస్తావిస్తున్న తీరులో తృతీయ ఫ్రంట్‌ అన్నది ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమన్నదే ప్రశ్నగా నిలుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ రాజకీయాలలో భూకంపం పుట్టిస్తానని కేసీఆర్‌ ప్రకటించినప్పుడు సహజంగానే టిఆర్‌ఎస్‌ శ్రేణులకు ఉత్సాహాన్ని నింపింది. జాతీయ నాయకుడిగా ఎదగడంతో పాటు కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడితే దానికి నాయకత్వం వహించడానికి కెసిఆర్‌కు మంచి అవకాశం వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. పివి తరవాత భాషాపరమైన సమస్య వల్ల దక్షిణాది నాయకులెవరూ ఇంతవరకు జాతీయ నాయకులుగా పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు. కేసీఆర్‌కు ఈ సమస్య లేదు. ఆయన ఆంగ్లంతో పాటు ఉర్దూ, హిందీభాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. సమస్యలను వెంటనే ఆకళింపు చేసుకోగలరు. దానిపై అనర్గళంగా ఉపన్యసించగలరు. ఆయనే అనుకుంటే ఆయన కూతురు ఎంపి కవిత, కొడుకు కెటిఆర్‌ కూడా తండ్రికి తగ్గ

తనయులుగా రాణిస్తున్నారు. అయితే కెసిఆర్‌ ఫ్రంట్‌పై అనుకూల వ్యతిరేక విమర్శలు కూడా వచ్చాయి.

ఫెడరల్‌ఫ్రంట్‌ ఆలోచనను ప్రకటించగానే భారతీయ జనతాపార్టీకి మేలు చేయడానికే ఆయన ఈ ప్రతిపాదన చేస్తున్నారన్న విమర్శలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అందుకే కెసిఆర్‌

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ముందుకు సాగేనా అన్న అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కున్న ఓటుబ్యాంకుతో రాష్టాల్ల్రో లాభ పడాలని మమతా బెనర్జీ, డిఎంకెలు చూ/-తున్నాయి. కాంగ్రెస్‌ ఫ్రంట్‌తోనే అవి ఉంటాయి. అలాంటప్పడుఉ కెసిఆర్‌ ప్రయత్నాలు సాగుతాయా అన్నదే అనుమానంగా ఉంది. అందుకే కాబోలు జాతీయ రాజకీయాల పేరిట తానేవిూ రాష్టాన్న్రి వదిలిపెట్టడం లేదని కేసీఆర్‌ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేయగలిగానన్న నమ్మకంతో కేసీఆర్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనతో ముందుకు సాగుతున్నారు. కేసీఆర్‌ తన రాజకీయ చతురతతో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ను విపక్షంలో ఉన్న బిజెపిని ఒప్పించడంతో పాటు, ఇతర రాకయీ పార్టీలను కూడా ఒప్పించి తెలంగాణ తీసుకుని రాగలిగారు. ఆనాడు ఉద్యమంలో కోదండరామ్‌ వంటివారు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పింది కాదు. ఇలా తెలంగాణ ఏర్పడటం, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకోవడం జరిగింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఆలోచనను కేసీఆర్‌ తెరపైకి తీసుకుని వచ్చారు. అయితే కోదండరామ్‌ నేతృత్వంలో తెరపైకి వచ్చిన తెలంగాణ జనసమితి ఇప్పుడు సవాల్‌ విసురుతోంది. కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా ఆయనతో జతకట్టారు. కదండరామ్‌ లేవనెత్తిన అంశాలపై సహజంగానే చర్చ మొదలయ్యింది. తెలంగాణలో నిజంగానే నిరంకుశ పరిస్థితులు ఉన్నాయి. కేసులతో వేధింపులు చేస్తున్నారు. పోలీసుల పర్మిషన్‌ లేనిదే చిన్న విూటింగ్‌ కూడా జరుపుకోవడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ దశలో ఫ్రంట్‌ కన్నా ముందు కెసిఆర్‌ ఇలాంటి సమస్యలను అధిగమించాలి. ఉదారతను చాటాలి. ప్రజల్లో ఓ మంచి అభిప్రాయాన్ని తీసుకుని రావాలి. వందిమాగధుల మాటలకు పొంగిపోకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేస్తున్న ప్రకటనలకు, ఇస్తున్న హావిూలకు.. క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య పొంతన ఉండటంలేదని చెబుతున్నారు. మంత్రులందరూ జిల్లాలలో పర్యటిస్తున్నప్పటికీ తమ శాఖలలో జరుగుతున్నదేమిటో సవిూక్షించలేక పోతున్నారు. బహిరంగ సభలలో కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడానికే మంత్రులు పరిమితం అవుతున్నారు. దీంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదో లేదో తెలియదు గానీ, అసంతృప్తి మాత్రం ప్రజలలో బీజం వేసుకుంటున్నదని గ్రహించడం లేదు. మరోవైపు కెసిఆర్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనల వెనక బిజెపి ఆలోచన పనిచేస్తోందన వాదన బలంగా ఉంది. పలు ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయి. బీజేపీ తమను ఎక్కడ కబళించివేస్తుందోనని అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలైన తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌ వంటివి ఆందోళన చెందుతున్నాయి. మారిన పరిస్థితులలో ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీకి బీజేపీనే ప్రధాన శత్రువుగా ఉంది. కేసీఆర్‌ చెబుతున్న ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ ఎజెండా కచ్చితంగా ఆకర్షణీయంగానే ఉంది. అయితే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజాప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు కేసీఆర్‌ చెబుతున్నవేవిూ తలకెక్కవు. రానున్న ఎన్నికలలో బీజేపీ ముప్పునుంచి తప్పించుకుని మళ్లీ అధికారంలోకి రావడమే ఆమెకు ప్రధానం కనుక అందుకు కాంగ్రెస్‌ సహకరాం కోసం ఆధారపడక తప్పదు. వచ్చే నెలలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కేసీఆర్‌ కలవబోతున్నారు.

ఆయన నుంచి ఎటువంటి హావిూ లభిస్తుందో తెలియదు. కేసీఆర్‌తో జరిగిన సమావేశాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్దగా పట్టించుకోలేదని స్థానిక పత్రికలలో వార్తలు వచ్చాయి. మొత్తంగా ప్రయత్నాలు మంచివే అయినా రాష్ట్రంలో తనవంతుగా ముందు అనేక విసయాల్లో సడలింపు ధోరణి ప్రదర్శించాలి. నిరంకుశ విధానాలకు పాతరేయాల్సి ఉంది.