హైదరాబాద్,సెప్టెంబర్4(జనంసాక్షి): ఇరు తెలుగు రాష్టాల్రు సుభిక్షంగా ఉండి అభివృద్దిలో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఆకలి దప్పులు లేకుండా.. అవినీతికి తావులేకుండా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయాలని ప్రార్థించానన్నారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తుల రాకను నిరోధించారు. ఇకపోతే సోవారం మధ్యరాత్రి వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిని ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఖరతాబాద్ గణెళిశుడి సేవలో ఉపరాష్ట్రపతి




