Tuesday, 3 November 2026

ఖలీదా జియాను అరెస్ట్ చేయండి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను అరెస్ట్ చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. రెండు అవినీతి కేసులను ఎదుర్కొంటున్న జియా.. భద్రతా కారణాల పేరుతో 50సార్లు విచారణకు హాజరుకానందుకు ఆమె బెయిల్ ను రద్దుచేస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి తెలిపారు. జియా ఆర్ఫనేజ్ ట్రస్ట్, జియా చారిటబుల్ ట్రస్ట్ లలో అవినీతి జరిగిందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఆమె పెద్ద కుమారుడు, మరో ఎనిమిది మంది నిందితులు కూడా వివిధ కారణాల రీత్యా హాజరు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *