Tuesday, 3 November 2026

650 స్టేషన్లలో బయోటాయిలెట్స్

దేశవ్యాప్తంగా 650కి పైగా రైల్వే స్టేషన్లలో బయో టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన.. తమ మొదటి ప్రాధాన్యత రైల్స్ క్లీనింగ్‌కేనని.. 650 రైల్వే స్టేషన్లలో 17వేల బయోటాయిలెట్లను ఆరు నెలల్లో నిర్మిస్తామని తెలిపారు. క్లీనింగ్ కోసం ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంటామని తెలపారు. రైల్వే స్టేషన్ల శుభ్రతకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రైల్వేల అభివృద్ధి కోసం 20 వేల సూచనలు వచ్చాయని పేర్కొన్నారు. రైళ్లలో అత్యున్నత స్థాయి పరిశుభ్రతను పాటించనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *