ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ సుడిగాలి పర్యటన

ఖానాపూర్ రూరల్ 23 జనం సాక్షి : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు.పెంబి మండలం లోని కర్ణం లోది గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రయివేటు పాఠశాల ధన్ రాజ్ విద్యానికేతన్ ను ఆమె ప్రారంభించారు.అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే రేఖ నాయక్ ను ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్ అత్తమ్మ గంగమ్మ రెండు రోజుల క్రితం స్వర్గస్థులు కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి సొంత గ్రామం మూట పూర్ వెళ్లి శంకర్ దంపతులకు పరామర్శించారు. అలాగే సతన్ పెళ్లి గ్రామంలో తెరాస నాయకులు డిష్ దాస్ కూతురి చెవి పొగలు కుట్టే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, నాయకులు కోకుల ప్రదీప్,రాజ్ కుమార్,తెరాస నాయకులు పాల్గొన్నారు