Tuesday, 3 November 2026

ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు : నాయిని

qgflysx3హైదరాబాద్ : ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. చంచల్‌గూడ జైలులో అధికారుల పునఃరుచ్చన తరగతుల ముగింపు కార్యక్రమంలో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జీవితంలో తొందరపడి తప్పు జైలుకు వచ్చిన వారిలో మార్పు తీసుకురావాలన్నారు. జైళ్లలో ఖైదీలకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఇప్పిస్తానని హామీనిచ్చారు. దేశంలో కన్నా దక్షిణాదిన తమ రాష్ట్రం ముందుండేలా పని చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *