అక్రమ కేసులతో వేధిస్తున్నారు
మద్యం,డబ్బు విచ్చలవిడిగా ఖర్చు
ఇప్పటికే 50కోట్లు పంచారన్న వంటేరు
కెసిఆర్ ఫామ్ హౌజ్‌లో చెక్ చేయాలని డిమాండ్
ఇసికి ఫిర్యాదు చేసిన ప్రతాపరెడ్డి
హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): గజ్వెల్ నియోజకవర్గంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, సిఎం కెసిఆర్, మంత్రి హరీ/- రావుల ఆదేవాలతో తమపార్టీవారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. మద్యం,డబ్బులు విపరీతంగా పంచుతున్నారని అన్నారు. హరీష్ రావు గత రెండు నెలలుగా అక్కడే తిష్టవేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హావిూని టీఆర్‌ఎస్ నెరవేర్చలేదని ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఈసీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన అనుచరులపై సివిల్ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పోలీసులు ఎందుకు తనిఖీలు చేయడంలేదని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఎవరూ ప్రచారం చేయొద్దని, ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దామని ఆయన అన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని వంటేరు డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులంటిని బయటపెడతానని ప్రతాపరెడ్డి అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్న వేలకోట్ల రూపాయలను పోలీసులు ఎందుకు సీజ్ చేయ్యట్లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు, ఈసీ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ప్రంతాప్ రెడ్డి ఆదివారం రిటర్నింగ్ అధికారి వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను అక్కడి నుంచి తరలించారు. ఆ తరవాత ఆస్పత్రిలో చేరారు. దీనిపై సోమవారం విూడియాతో మాట్లాడుతూ..పోలీసులు, ఎన్నికల అధికారులు తనన వేధిస్తున్నారని, వారి తీరులో మార్పు రాకుంటే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని వంటేరు హెచ్చరించారు. కాగా ఈసీ అధికారుల తీరుకు నిరసనగా ఆదివారం ఆయన రిటర్నింగ్ అధికారి కార్యలయం ముందు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై ఇరవై ఏళ్లుగా పోరాడుతున్న తనపై కేసీఆర్ సీఎం అయ్యాక తనపై 27 కేసులు పెట్టించారని ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజలను కాపాడటానికి ఉన్నారా లేక టీఆర్‌ఎస్ నేతల కోసం పనిచేయడాని ఉన్నారా అని మండిపడ్డారు. ప్రజలందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తూ హరీష్ రావు గల్లీ లీడర్ అయ్యాడని.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను ఆత్మబలిదానానికైనా సిద్ధమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసిన ఆయన.. అధికారులు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. తన టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ… పక్కనే సివిల్ పోలీసులను పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులే స్వయంగా డబ్బులు, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో డబ్బులున్నాయని.. పోలీసులు ఎందుకు తనిఖీలు
చేయడంలేదని సీఈవో దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా? అని వంటేరు ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఒక్క తెరాస నేత వాహనాన్ని సీజ్ చేశారా? అని నిలదీశారు. ఎర్రవల్లిలో 337 ఎకరాలు ఉంటే కేసీఆర్ 57 ఎకరాలు మాత్రమే అధికారికంగా ప్రకటించారన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల్లో మార్పు రావాలని.. లేకుంటే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని హెచ్చరించారు. భ్రఘ్ట పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి తన ప్రాణమైన త్యాగం చేస్తానని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న హరీష్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని.. ఆయనకు 2001 నాటి రబ్బర్ చెప్పులు వచ్చేలా చేస్తానని ధ్వజమెత్తారు. తనకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నాని, చనిపోతే బొంద పెట్టడానికి కూడా సొంత జాగా లేదని ఆయన ఆవేదన చెందారు.




