Tuesday, 3 November 2026

గడప గడపకి బీజేపీ జిల్లా నేతల ప్రచారం.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : అదిలాబాద్ జిల్లాలోని బీజేపీ నేతలు గడపగడపకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ గ్రామాన తిరుగుతూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి  చేపట్టి ఎనిమిది  సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోథ్  నియోజకవర్గంలోని పలు మండలాల్లో  ఎంపీ సోయం బాపురావు బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో     విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సంక్షేమ ఫలాలను వివరిస్తున్నారు. అలాగే ఈ నెల 15న ఉట్నూర్ మండలానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు బిజెపి నాయకులకు సోయం బాపు రావు  దిశానిర్దేశం చేశారు. ఓటరు సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. వారి వెంట గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సాకటి  దశరథ్. మా నాజీ. సామ సంతోష్ రెడ్డి. తదితరులు ఉన్నారు.