Monday, 2 November 2026

గద్వాల నుంచే కేసీఆర్‌ పతనం

ప్రారంభమవుతుంది
– కాంగ్రెస్‌ హయాంలోనే పాలమూరులో ప్రాజెక్టులు పూర్తయ్యాయి
– పాలమూరును సస్యశ్యామలం చేసింది మేమే
– తెరాస మంత్రి అవినీతి వల్లే కల్వకుర్తి లిఫ్ట్‌ పనులు ఆగిపోయాయి
– ఎన్నికలొస్తున్నాయని గట్టు లిఫ్ట్‌ గుర్తొచ్చిందా?
– గద్వాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి
– ఎవరో అడ్డుకుంటే ప్రాజెక్టులు ఆగిపోవు..
– అడ్డుంకులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
– హరీష్‌రావు, కేటీఆర్‌లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
– మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ
హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి): గద్వాల నియోజకవర్గం నుంచే కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలోనే పాలమూరులో ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. పాలమూరును సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్సే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పాలమూరు టీఆర్‌ఎస్‌ మంత్రి అవినీతి వల్ల కల్వకుర్తి లిఫ్ట్‌ ఆగిపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అవకాశవాది అని, అవసరాన్ని బట్టి మాట్లాడతారని డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క
హావిూని కేసీఆర్‌ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలొస్తున్నాయని గట్టు లిఫ్ట్‌ గుర్తొచ్చిందా అంటూ కేసీఆర్‌ను నిలదీశారు. గద్వాల్‌ ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి టీఆర్‌ఎస్‌ నేతలు జేబులు నింపుకొన్నారని అన్నారు. ఎవరో అడ్డుకుంటే ప్రాజెక్టులు ఆగిపోవని, అడ్డంకులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. మహిళలను గౌరవించే సంస్కారం టీఆర్‌ఎస్‌కు లేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గురించి కేటీఆర్‌ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. సోనియా వల్లే తమ కుటుంబం పదవులు అనుభవిస్తోందన్నారు. మంత్రి హరీశ్‌రావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని డీకే అరుణ హెచ్చరించారు. ఎన్నికలు వస్తున్నాయని మొక్కుల పేరిట కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే మంత్రి హరీష్‌రావు ఎప్పుడో కాంగ్రెస్‌ కండువా కప్పుకునేవారని డి.కె. అరుణ వ్యాఖ్యానించారు. గద్వాలకు 5 వేల ఇళ్లు ఇస్తామని చెప్పారని, మరి ఏవి అని ప్రశ్నించారు. కలిసి పనిచేద్దాం అన్నారు… ఎప్పుడైనా కలుపుకొని పోయారా అంటూ అరుణ ప్రశ్నించారు. ఎమ్మెల్యే లతో ఎప్పుడైనా మాట్లాడారా..? థర్మల్‌ ప్రాజెక్ట్‌.. సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏమైంది..? ఎన్నికలు వస్తున్నాయని గట్టు ప్రాజెక్ట్‌ గుర్తుకు వచ్చిందా? డీపీఆర్‌ సిద్ధం చేయటానికి నాలుగేళ్లు పట్టిందా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.