కడప,నవంబర్13(జనంసాక్షి): మంగంపేట గనుల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని స ఇపిఎం నేతలు డిమాండ్ చేశారు. అసలు పరిహార చెల్లింపులో ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మిల్లుల్ని తెరిపించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఉదయం విలేకరులతో సమావేశమైన నారాయణ మాట్లాడుతూ.. అధికారులు అదనపు లబ్ధిని చేకూర్చుకుంటూ.. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లకు రాయితీలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మిల్లులు మూతపడ్డాయని, రాయితీలిచ్చి మిల్లులను
తిరిగి తెరిపించాలని డిమాండ్ చేశారు. మిల్లుల్ని తెరిపించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.




