హైదరాబాద్: గర్భిణిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్భాణి జిల్లా కుడులపాటి గ్రామంలోని పలు ఇళ్లల్లో మంగళవారం దొంగలు పడ్డారు. వారిని గమనించిన ముగ్గురు గ్రామస్థులను దుండగులు గాయపరిచారు. అనంతరం ఓ గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో అత్యాచారానికి గురైన మహిళ, ముగ్గురు గ్రామస్థులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.




