Monday, 2 November 2026

కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌ గడువు పెంపు

 

66హైదరాబాద్: కేబుల్ టీవీ డిజిటలైజేషన్కు రెండు నెలల గడువు పొడిగిస్తున్నట్లు హైకోర్టు బుధవారం ప్రకటించింది. సెట్‌టాప్ బాక్స్ కోసం (టీవీ డిజిటలైజేషన్కు) గతంలో ప్రకటించిన గడువు ఈ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ గడువు మరింత పొడిగించాలంటూ తెలంగాణ ఎంఎస్వోల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

85 శాతం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సెట్ అప్ బాక్స్ సరఫరా చేయలేదని తమ పిటిషన్లో వారు పేర్కొన్నారు. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు.. సెట్‌టాప్ బాక్స్ అమర్చుకోవడానికి రెండు నెలల గడువు పొడిగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *