Tuesday, 3 November 2026

మెట్ పల్లి లో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుజ్జాల ప్రేమేందర్ రెడ్డి, కార్యదర్శి గంగారెడ్డి
మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 02,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని వాసవి గార్డెన్ లో గురువారం రోజున బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. బిజెపి జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జాల ప్రేమేందర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.ఇట్టి సమావేశంలో జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ర తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే నని దీనికి సైనిక శక్తి లాగా ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలతో ఉంటూ వారికి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు తెలుపాలని అన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని విఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని అందుకే వారు
బిఆర్ఎస్ పార్టీగా మార్చారని ఇక్కడ తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు సమ్మతించాలని బిజెపి కార్యకర్తలు కష్టపడాలని అన్నారు,అనంతరం రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుకు చేరుకుందని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని,
విద్యుత్తు సంస్థలు సివిల్ సప్లై సంస్థలు అప్పుల ఊబిలో కూరుకపోయాయి లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమి లేదని ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు వాయిదాల చెల్లింపుల ద్వారా రాష్ట్రానికి చెల్లింపులు ప్రారంభం అయ్యాయని, కానీ దాని ద్వారా లాభం లేదని దేశంలో మద్యం ద్వారా 40000 వేల కోట్లతో ప్రభుత్వం నడిపిస్తున్న రాష్ట్రము ఉందంటే కెసిఆర్ తెలంగాణ రాష్ట్రమని అది కేసిఆర్ ప్రభుత్వమేనని తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రివర్గం వారి ఆస్తులు వెల్లడించాలని పేద ప్రజలకు
ఎసిడి పేరుతో కరెంటు బిల్లు భారం వేయడం దేశంలో ఎక్కడా లేదని దీనిపై ప్రతి బిజెపి కార్యకర్త ప్రభుత్వం పై నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలని అలాగే జగిత్యాల నగరం మాస్టర్ ప్లాన్ పేరుతో పేద మధ్య ప్రజల వ్యవసాయ ఆధారిత భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని
అలాగే మాత శిశు ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయం లేక ఈ మధ్యకాలంలో బాలింతలు చిన్నారులు మరణించిన స్థానిక మంత్రి ,ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని అలాగే వారికి నష్టపరిహారం ఇస్తలేరని జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ధర్మపురి ఆలయాల అభివృద్ధి నిధులు మంజూరు చేయక భక్తులు కనీస సదుపాయలేక తీవ్ర అసౌకర్యం ఏర్పడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం బిజెపి జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని, దీనిని ప్రభుత్వము పట్టించుకుని రెండు పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ధర్మపురి నదిలో ప్రవహిశిస్తున్న మురికి నీరు యాత్రికులకు తీవ్ర అసౌకర్యంగా ఏర్పడిందని స్థానిక మంత్రి కనీసం 30 కోట్లు నిధులు ప్రతిపాదన పంపామని తెలిపి ఏళ్ళు గడుస్తున్నా పనులు జరుగుతలేవని కథలాపూర్ మండలం కలికోటలో సూర్యమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మిరి మేడిపల్లి కథలాపూర్ రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు పనులు ప్రారంభం కావడం లేదని దీవిని బిజెపి శాఖ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ,
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాగోష బీజేపీ భరోసా యాత్ర జిల్లా ప్రజలు మంచి మద్దతు పలకారని,అదే స్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుడుగా పార్టీని పేద ప్రజల వద్దకు తీసుకెళ్లి వారికి చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన రాష్ట్రానికి నిధులు కేటాయించిన వివరించాలని రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రలో స్పందన చాలా బాగుంది కాబట్టి, అదే విధంగా బిజెపిని బలోపేతం చేయడం ఇదే తరణముగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి పార్టీ పథకాలు ప్రచారం చేయాలని కోరారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని బూత్ కమిటీలను బలపరచాలని కమిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పేద ప్రజల లబ్ధి పథకాలను రాష్ట్రాన్ని కేటాయించిన నిధులు మరియు కరోనా టైం నుండి ఇంతవరకు ఇస్తున్నారు, రేషన్ బియ్యం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిస్తున్నారని ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్
మ్యాన్ మహేష్ ,జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్, తుల ఉమా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్,మిదుకర్, ఇల్లెందుల కృష్ణమాచారి,సత్యనారాయణ,
అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్,సుదన్ మోహన్,ఇందూరి సత్యం, నిజామాబాద్ పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివ్, శ్రీధర్, జెఎన్ సునీత,మీనా,సురభి నవీన్ కుమార్, పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్,ధోనికల నవీన్, విజయ్ ,నరేష్, బిజెపి పార్టీ సీనియర్ రాష్ట్ర, జిల్లా, గ్రామ పట్టణ నాయకులు పాల్గొన్నారు