డిఎంకెలో వారసత్వ పోరుపై ఆందోళన
హైదరాబాద్,ఆగస్ట్13(జనం సాక్షి): డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత ఆ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కరుణానిధి తనయులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మెరీనా బీచ్ లో తండ్రి సమాధిని దర్మించుకున్న అళగిరి స్టాలిన్ పై ఫైయ్యారు. కరుణానిధి అసలైన అనుచరులు, కుటుంబ సభ్యులు తన వెంటనే ఉన్నారని, కాలమే దీనికి సమాధానం చెప్తుందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో గతంలో అళగిరిని కరుణానిధి డీఎంకే నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న అళగిరి తాజాగా తన తమ్ముడిపై బహిరంగ విమర్శలకు దిగారు. స్టాలిన్ ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ గా పనిచేస్తున్నారు. రేపు జరిగే డీఎంకే అత్యవసర సమావేశంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్టాలిన్ కు అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




