Tuesday, 3 November 2026

గవర్నర్‌తో గాంధీ వైద్యుల భేటీ

సమస్యలపై వినతి పత్రం సమర్పణ
హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి): తమ న్యాయపరమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి వైద్యులు బుధవారం గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. తమ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. వైద్య సంఘాలతో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని డాక్టర్‌ సుభోద్‌ కుమార్‌ తెలిపారు. అత్యవసర సేవలను వదిలి ధర్నా చేయటం పట్ల, వైద్యుల అభ్యర్ధనల పట్ల గవర్నర్‌ మండిపడినట్లు సమాచారం. విధులు బహిష్కరించడం వల్ల్‌ సామాన్యులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారిన సమాచారం.